09-04-2025 08:47:22 PM
గిట్టుబాటు ధర కోసమే కొనుగోలు కేంద్రాలు..
డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి..
కొండపాక: కుక్కునూరు పల్లి, కొండపాక మండలాలలో రైతుల సౌకర్యార్థం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. కొండపాక మండలంలోని రవీంద్రనగర్, ధమ్మక్కపల్లి, కొండపాక, కుకునూరు పల్లి మండలంలోని మెదినిపూర్ లో రైతుల సౌకర్యార్థం కోసం ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు అమ్ముకోవడం వలన గిట్టుబాటు ధర అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండపాక మండల తహసీల్దార్ దిలీప్ నాయక్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంఏఓ శివరామకృష్ణ, కుకునూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విరుపాక శ్రీనివాస్ రెడ్డి, కుకునూరు పల్లి తహసిల్దార్, ఎంపీడీవో, ఎంఏఓ తదితరులు పాల్గొన్నారు.