16-04-2025 01:11:06 AM
కొండాపూర్ ఏప్రిల్ 15 :ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్, తొగర్ పల్లిలో కొనుగో లు కేంద్రాలను టీజీఐఐసి చైర్మెన్ నిర్మల జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17శాతం తాలు తేమ లేకుం డా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.
తరుగు లేకుండా రైతులకు మోసం చేయకుండా ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని, రైతులను కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు గురి చేయకుండా ధాన్యాన్ని సేకరిం చాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ వై.ప్రభు, సొసైటీ చైర్మన్లు పవన్ కుమార్, రాజు, సిడిసి చైర్మన్ గడీల రామ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎల్.శ్రీకాంత్ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ , బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, బీఆర్‌ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మల్లేశం, రాంచంద్రయ్య, ప్రేమానందం, తహసిల్దార్ అశోక్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏవో గణేష్ పాల్గొన్నారు.