calender_icon.png 20 April, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈటూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

09-04-2025 06:56:16 PM

నాగారం: నాగారం మండలం ఈటూరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పిఎసిఎస్ చైర్మన్, పాలెపు చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ధాన్యాన్ని శుభ్రంగా తాలు లేకుండా చేసి 17% తేమ ఉండేటట్లుగా చేసుకొని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను 2320 ను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో విజయ్ కృష్ణారెడ్డి డైరెక్టర్లు గుంటకండ్ల అశోక్ రెడ్డి రావుల సత్తయ్య పంది ఐలయ్య లావుడ్యా రంజాన్ నాయక్ లోడే ఐలయ్య బానోత్ కృష్ణ శివ జంపాల రవీందర్ పేరాల యాదగిరి నాతి వెంకన్న సెంటర్ ఇంచార్జ్ నాగార్జున మహేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.