calender_icon.png 25 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

25-04-2025 07:50:40 PM

పాపన్నపేట: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారిణి రజిత రైతులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కుర్తివాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారభించారు. కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సొసైటీ డైరెక్టర్ సత్యనారాయణ, సిబ్బంది వెంకటేశం, రైతు నాయకులు శ్రీధర్, రామా గౌడ్, కొన్యాల సంజీవరెడ్డి, వడ్డేపల్లి సంజీవరెడ్డి, రాజేందర్, మోహన్ రావు, జగన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.