calender_icon.png 20 April, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

12-04-2025 12:15:49 AM

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 11 ( విజయ క్రాంతి ): భువనగిరి పిఎసిఎస్ పరిధిలోని  తుక్కాపురంలో ధాన్యం కొనుగోలు సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. 

దళారీలకు అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాలలో అమ్ముకొని మద్దతు ధర  పొందాలని కోరారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ప్రజలకు మేలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు రైతన్నలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వరి వేస్తే ఊరేనని భయభ్రాంతులకు గురిచేసిందని అన్నారు.

అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతన్నలు ఇటువంటి నష్టానికి గురైన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సలహాలు సహకారం అందించకపోగా ఎక్కడ తప్పులు దొరుకుతాయో అని చూస్తూ విమర్శలు చేయడానికి పరిమితమయ్యారని తీవ్రంగా విమర్శించారు. కెసిఆర్ కుటుంబం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోచుకుని అప్పులపాలు చేశారని ఆరోపించారు.

ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని లక్ష్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు నోముల పరమేశ్వర్ రెడ్డి గారు, ఆర్డీవో కృష్ణారెడ్డి గారు, డి సి ఎస్ ఓ యాదాద్రి భువనగిరి గారు, ఎం ఏ ఓ భువనగిరి మల్లేష్ గారు, ఏఎంసీ చైర్మన్, గ్రంధాలయ చైర్మన్, సంఘ వైస్ చైర్మన్ మహేందర్ నాయక్ డైరెక్టర్లు గుమ్మడి సురేందర్ రెడ్డి గారు, మరియు రైతులు సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.