calender_icon.png 18 April, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

09-04-2025 12:42:46 PM

చిలుకూరు,(విజయక్రాంతి): చిలుకూరు మండలo పాలన్నారం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఐకెపి కేంద్రాన్ని బుధవారం  పిఎసిఎస్ చైర్మన్, కొండ సైదయ్య, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ధాన్యాన్ని శుభ్రంగా తాలు లేకుండా చేసి 17% తేమ ఉండేటట్లుగా చేసుకొని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని, ప్రభుత్వం ప్రకటించిన 500,రూపాయలు బోనసులు ప్రతి రైతు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ తమనబోయిన వీరబాబు, సొసైటీ డైరెక్టర్లు తమనబోయిన గోపయ్య, మట్టయ్య, ముత్తయ్య, బుచ్చమ్మ, హలియా, నాగేశ్వరరావు, రాంబాబు, నాగరాజు, కాటూరి ఏసు, బొల్లె పంగు  ఏసు, సంగం సెక్రెటరీ గండ్ర పూర్ణయ్య, నాగప్రసాద్ అఖిల్ గోపి శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.