calender_icon.png 21 April, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తరుగు లేకుండా ధాన్యం కొనుగోళ్లు : డా.కవ్వంపల్లి

19-04-2025 01:59:22 AM

మానకొండూర్,ఏప్రిల్18(విజయక్రాంతి):ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు, తేమ పేరిట కోతలు విధించకుండా కొనుగోళ్లు చేపడతామని మానకొండూర్ శాసనభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు.  శుక్రవారం మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి, మానకొండూర్, రంగపేట, పచ్చునూరు, వెల్ది, వేగురుపెల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇక నుంచి తాలు,తేమ,తరుగు పేరిట ఎలాంటి కోతలు ఉండని , ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర పొందాలని సూచించారు. దళారుల బారినపడకుండా ఉండేందుకు వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.

రైతాంగానికి అండగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అందుకే ఆ దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.  వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధి రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ 500 బోనస్ ఇస్తున్నదన్నారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని  పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో మానకొండూర్ మండల తహశీల్దార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్రాచారి, మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ ఆర్ తిరుమల్ రెడ్డి, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, పి.కనుకయ్య, శ్రీనివాస్ రావు, ఎం నాగిరెడ్డి,

బి.మల్లయ్య గౌడ్, ఎన్.బాబురావు, దాసరి శంకర్, వాల అంజుత్ రావు, బోళ్ల మురళీధర్, సాయిరి దేవయ్య, మాడ తిరుపతి రెడ్డి, కనుకం అశోక్, కోండ్ర సురేష్,రొంటాల లక్ష్మారెడ్డి, శ్రీధర్,సుధగోని తిరుపతి గౌడ్,  ఇర్ఫాన్, మడపు ప్రేమ్ కుమార్, కనుకం రాకేష్ తదితరులు పాల్గొన్నారు.