పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మె ల్యే విజయరమణారావు రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం మడిపల్లి కాలనీ, అంకంపల్లి, మడిపల్లి, ఆషన్నపల్లి, గంగారం, పెద్దంపేట, లక్ష్మీపూర్, పందిళ్ల, ఆరెపల్లి గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
రైతు సంక్షేమమే ధ్యేయం గా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచా రం నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, సింగిల్ విండో చైర్మన్ రామచం ద్రరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గజవేని సదయ్య, మున్వర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి, రావి సదానందం, మాజీ సర్పం చ్‌లు శంకర్‌గౌడ్, దేవేందర్ రావు, బంగారు రమేశ్, రవి, గోవర్ధన్, అశో క్, సతీశ్, వెంకన్న పాల్గొన్నారు.