రాష్ట్ర పౌరసరఫరాల ముఖ్యకార్యదర్శి డీఎస్ చౌహాన్
గజ్వేల్, దుద్దెడలో ధాన్యం కొనుగోళ్ల పరిశీలన
గజ్వేల్, నవంబర్19: రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుం డా జనవరి నెలాఖరు వరకు కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని అధికారులను పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మనుచౌదరితో కలిసి గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.. సిద్దిపేట జిల్లాలో 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉండగా ఇప్పటికే 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందన్నారు.
దుద్దెడ కొనుగోలు కేంద్రం తనిఖీ
కొండపాక నవంబర్ 19(విజయక్రాంతి): దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సివిల్ సప్లయీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ సూంచారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయనతనిఖీ చేశారు. అయన వెంట కలెక్టర్ మనుచౌధరి, జిల్లా సివిల్ సప్లయాస్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, అధికారులు ఉన్నారు.