calender_icon.png 3 April, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి

28-03-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం మార్చి 27 (విజయక్రాంతి): జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐ డి ఓ సి లో జిల్లా పౌరసరఫరాల సంస్థ , పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లు, వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ, తూనికలు కొలతలు, రవాణా, మార్కెటింగ్ శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,84,502 మెట్రిక్ టన్నుల కాగా అందులో సన్నరకం 99,729 మెట్రిక్ టన్నులు , దొడ్డు రకం దాన్యం వస్తుందనే అంచనాతో 144 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అవసరాన్ని బట్టి అదనపు దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. రైతన్న పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పనకు ఏ, బి గ్రేడ్ రకాలుగా విభజించి మద్దుతు ధర ప్రకటించినట్లు చెప్పారు.

ఏ గ్రేడ్ ధాన్యంరూ 2,320, బి గ్రేడ్ రకం రూ.2 300 రూపాయలుగా మద్దుతు ధర నిర్ణయించామన్నారు. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ,హమాలీలు వడ దెబ్బకు గురి కాకుండా టెంట్లు, షెడ్ నెట్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసి నీడ ఉండేవిధంగా చూడాలన్నారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, డిఆర్డిఓ విద్యచందన , పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్, పౌర సరఫరాల అధికారి రుక్మిణి, డిసిఓ కుర్షిథ్ , వ్యవసాయ అధికారి బాబురావు , జిసిసి మేనేజర్ విజయకుమార్ , తూనికలు కొలతల అధికారి మనోహర్, మార్కెటింగ్ అధికారి నరేందర్, రెస్ మిలర్ అసోసియేషన్ నుండి ఆనందరావు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నాడు.