18-04-2025 12:42:36 AM
చేర్యాల,ఏప్రిల్ 17 చేర్యాల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్ల ప్రారంభించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొంగర వెంకట్ మావో అన్నారు. పట్టణం లో గల వ్యవసాయ మార్కెట్ ను స్థానిక సిపిఎం నా యకులతో కలిసి సందర్శించి, రైతులతో మా ట్లాడారు. అనంతరం మాట్లాడుతూ రైతులు పండించిన పంటను మార్కెట్కు తెచ్చి, ఆరబోసి అమ్ముకోవడం కోసం ఎదురు చూ స్తున్నారన్నారు.
ధాన్యంతో మార్కెట్ అంతా నిండిపోయింది అన్నారు. స్పందించి వెంట నే ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు కొనుగోలు చేస్తే, కొత్త రైతులకు అవకా శం లభిస్తుందన్నారు. వాతావరణం లో మార్పులు వస్తున్నాయని, అకాల వర్షాలు కురిస్తే, ఆరుగాలం శ్రమించి పండించిన పంట తడిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.