కామారెడ్డి,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన దాన్యం వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం అధికారులతో మాట్లాడారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో ధాన్యం కొనుగోలు సమగ్ర సర్వే పై అధికారులతో సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని ఆదేశించారు. సమగ్ర సర్వే డేటాను సైతం తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి డేటా ఎంట్రీకి అవసరమైన డాటా ఆపరేటర్లను నియమించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.