calender_icon.png 22 October, 2024 | 4:54 AM

ధాన్యం కొనుగోలు కాక.. అన్నదాతల అవస్థలు

21-10-2024 09:37:43 PM

కరీంనగర్ సిటీ,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తూతూ మంత్రంగా ప్రారంభం చేశారని తలపెల్లి శ్రీనివాస్ గౌడ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి  ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా గత 15 రోజుల నుండి రైతులు పంటలు కోస్తున్నారని అంతేకాక మ్యాచర్ కూడా రావడం జరిగింది కానీ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పట్టించుకోకుండా హైడ్రా దానిపై ఉన్న శ్రద్ధ  ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పెట్టడం లేదనన్నారు. అలాగే ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాల స్థలాలను ఎంపిక చేయలేదని దుయ్యబట్టారు.

వెంటనే జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించాలి లేదంటే ఈ అకాల వర్షాల వల్ల ఉన్న పంట కాస్త నీరు పాలై పోతుందన్నారూ. అంతేకాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు తీసే యంత్రాలను, ధాన్యంపై కప్పుకునే కవర్లను,బారదానులను అవసరాల మేరకు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.