04-04-2025 08:36:16 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): యాసంగి సీజన్ లో వరి ధాన్యం కొనుగోళ్లకు కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో పౌర సరఫరాలు, సహకార శాఖాధికారులు, వ్యవసాయం, మార్కెటింగ్, గ్రామీణాభి వృద్ధి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ యాసంగి సీజన్ లో వరి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు, ఇప్పటి వరకు 33 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించడం జరిగిందని అన్నారు, ఇప్పటి వరకు 686 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించడం జరిగిందని తెలిపారు. మిగతా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, అవసరమైన టార్ఫాలిన్, తూకం మిషన్లు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్స్, క్యాలీ పర్స్ లను
అందుబాటులో ఉంచాలని తెలిపారు.కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యంను ఆయా మిల్లులకు తరలించాలని తెలిపారు. అకాల వర్షాల వలన రైతులకు ఇబ్బందులు తేలెత్తకుండా టార్ఫాలిన్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో 15 జొన్న కోనుగోళ్లకు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు, ప్రభుత్వ అనుమతులు రాగానే జొన్న పంట కొనుగోళ్లు ప్రారంభించాలని తెలిపారు. మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు కేంద్రాలకు అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.