calender_icon.png 8 April, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

07-04-2025 07:29:14 PM

దళారులకు ధాన్యం విక్రయించి రైతులు నష్టపోకూడదు..

నాగిరెడ్డిపెట్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దళారులకు ధాన్యం విక్రయించి రైతులు నష్టపోకూడదని తాండూర్ కిచ్చన్నపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు ఆకిడి గంగారెడ్డి అన్నారు. సోమవారం తాండూరు కిచ్చన్నపేట ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని, తాండూర్, ఆత్మకూర్, జలాల్పూర్, మెల్లకుంట తండా, జప్తి జాన్కంపల్లి, బొల్లారం, రాఘవపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ ఆకిడి గంగారెడ్డి, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి నర్సింహం, సివిల్ సప్లై, నాయబ్ తాసిల్దార్, సురేష్ మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, ప్రాథమిక సహకార సంఘం ఉపాధ్యక్షులు బాబురావు, డైరెక్టర్లు వేముల సంగయ్య, సిద్ధిరాంరెడ్డి, విజయ్ కుమార్ గోపాల్, హనుమాన్ నాయక్, కిషన్ నాయక్, బన్సీ నాయక్, జయరాజ్, కార్యదర్శి మురళి, రైతులు తదితరులు పాల్గొన్నారు.