09-04-2025 06:27:55 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): సన్నరకం ధాన్యానికి 500 బోనస్ ఇస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన బుధవారం నాడు గుణుకుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని గిరిని తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తుండడంతో ఎన్నడూ లేని విధంగా రైతన్నలు రికార్డ్ స్థాయిలో సన్నరకం ధాన్యం పండింస్తున్నారన్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన రెండు, మూడు రోజుల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు జమ చేస్తుందని ఈ ప్రభుత్వం రైతన్నల ప్రభుత్వం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వ్యవసాయ అధికారి నవ్య, ఏఈవో రేణుక నాయకులు సవాయి సింగ్, జగ్మాల్, రాములు, డాన్సింగ్, గంగారాం, రాజా, సురేష్, రాజేందర్, పర్శ, సక్ర, ఛత్రు, హరి, సంతోష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.