calender_icon.png 22 April, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

21-04-2025 12:00:00 AM

చొప్పదండి, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం  కొనుగోళ్లను వేగవంతం చేయాలని  గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, గంగాధర సింగిల్విండో చైర్మన్  దూలం బాలగౌడ్ నిర్వాహకులకు సూచించారు. ఆదివారం జిల్లాలోని గంగాధర మండలం మంగపేట, చర్లపల్లి (ఎన్), కోట్ల నరసింహులపల్లి, నాగిరెడ్డి పూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు.