calender_icon.png 5 November, 2024 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

04-11-2024 04:11:31 PM

కామారెడ్డి (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి మండలం గర్గుల్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు. అదనంగా హమాలీలను నియమించుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రం నిర్వాకులకు సూచించారు. వారి ధాన్యంలో చెత్త లేకుండా జల్లేడ (ప్యాడి) క్లీనర్ పెట్టాలని తెలిపారు. కొనుగోలు చేసే ముందు ధాన్యం తేమ శాతం కొలవాలని పేర్కొన్నారు. ధాన్యం తూకంలో ఎలాంటి వ్యత్యాసం రాకుండా ప్రతి బస్తా 40 కిలోల 600 గ్రాముల తూకం వేయాలని అన్నారు. తూకం వేసిన బస్తాలను లారీలో నింపి కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథరావు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాజేందర్, ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింహారావు, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, తాసిల్దార్ జనార్ధన్, రైతులు పాల్గొన్నారు.