జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పి.డి శ్రీనివాసరావు
పాపన్నపేట (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలని మెదక్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడి శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. శుక్రవారం పాపన్నపేట మండల పరిధిలోని అరికెల, నార్సింగి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగాలని, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట ఏపీఎం సాయిలు, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.