కౌడిపల్లి (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో సన్నవడ్లకు రైతులకు బోనస్ చెల్లింపు మొదలు కాబడినదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం మెదక్ జిల్లాలో కౌడిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు రైస్ మిల్స్ సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 490 కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటివరకు 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు, జిల్లాలో సన్న వడ్లకు 1,280 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుగాను శంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామం, శివంపేట మండలం, తిమ్మాపూర్ గ్రామం, తూఫ్రాన్ పరిధిలో గుండ్రెడ్డి పల్లి గ్రామాలకు సన్నవడ్లకు 6 లక్షల 40 వేల రూపాయలు బోనస్ రిలీజ్ చేయడం జరిగిందని అన్నారు.
మిల్లర్స్ ధాన్యం కొనుగోలు ద్వారా రవాణా చేసిన ధాన్యానికి దిగుమతి చేసుకొని త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. ఏ రోజు వచ్చిన ధాన్యం అదే రోజు కొనుగోలు జరిగేలా.. అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను OMPSలో అప్పటికప్పుడు నమోదు అయ్యేలా తగు ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా నిన్నటి వరకు 1 లక్ష 37, వేల 673 కుటుంబాలకు సర్వే నిర్వహించామని, 62.93% శాతంగా నమోదు అయిందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట కౌడిపల్లి తహసీల్దార్, సంబంధిత కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, సమగ్ర కుటుంబ సర్వే ఎనిమరేటర్లు పాల్గొన్నారు.