నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ప్రతి రోజు తూకం వేసిన ధాన్యంను వెంట వెంటనే రైస్ మిల్లర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. శుక్రవారం మంజులాపూర్ చిట్యాల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనఖీ చేవారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రంకు వచ్చిన దాన్యం తూకం వేసిన ధాన్యం, తరలించిన ధాన్యం ట్యాబ్ ఎంట్రి తదితర వివరాలు అడిగి తెలుసుకొన్నారు. కేంద్రాలకు పెద్ద మొత్తంలో ధాన్యం వస్తున్నందున అధికారులు రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు. దాన్యం తరలింపులో జాప్యం చేస్తే చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కిరణ్కుమార్, గోపాల్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.