calender_icon.png 15 November, 2024 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లాల్లోనే ధాన్యం

04-11-2024 12:07:04 AM

  1. ఇప్పటికీ ప్రారంభంకాని కొనుగోళ్లు 
  2. నేటికీ కొలిక్కిరాని మిల్లుల ఎంపిక
  3. సూర్యాపేట జిల్లాలో రైతుల అవస్థలు

సూర్యాపేట, నవంబర్ 3 (విజయక్రాం తి): సూర్యాపేట జిల్లాలో ప్రధాన పంట వరి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కోతలు ప్రారంభమై 20 రోజులు కావస్తున్నాయి. ప్రస్తుతా నికి జిల్లాలో 30 శాతం కోతలు పూర్తయ్యా యి.

కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, కొన్నిచోట్ల ప్రారంభించినా కొనుగోళ్లు ప్రారంభించకపోవ డంతో రైతులు కల్లాల్లోనే ధాన్యం ఉంచుతున్నారు. కొందరు మిల్లర్లకు తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. మరొకొందరు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి, కాంటా కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ జిల్లాలో మిల్లుల ఎంపికనే జరుగలేదు. 

3.79లక్షల మెట్రిక్ కొనుగోలు లక్ష్యం

జిల్లా వ్యాప్తంగా ఖరీప్ సీజన్‌లో 4.72లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో 3.79 లక్షల ఎకరాల్లో సన్న రకా లు, 93వేల ఎకరాలల్లో  దొడ్డు రకాలను సాగు చేశారు. సాగైన వరి పంటకు దాదాపు 10.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

ఇందులో స్థానిక మార్కెట్‌లలో విక్రయించే ధాన్యం, రైతులు తమ అవ సరరాలకు వినియోగించుకునే ధాన్యం మినహాయిస్తే3.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 206 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సుమారు 170 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ కొనుగోళ్లను మాత్రం ప్రారంభించలేదు.  

పూర్తికాని మిల్లుల కేటాయింపు

జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ఖరీప్ సీజన్‌లో సుమారు 300 కొనుగోలు కేంద్రాలు, రబీ సీజన్‌లో 320కి పైగా కొనుగోలు కేంద్రాలనును ఏర్పా టు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరించే వారు. సేకరించిన ధాన్యం మరాడించేందుకుగాను మిల్లుల ఎంపిక, అందుకు అవసరమైన రవాణ, గోనే సంచులు వంటివి ముందుగానే సిద్ధం చేసేవారు.

ఈ ప్రక్రియ ధాన్యం కొనుగోలు కేంద్రా ల ఏర్పాటుకు ముందే పూర్తి చేసేవారు. కానీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మిల్లు ల ఎంపిక పూర్తి కాలేదు. గతంలో  సుమారు 70కి పైగా మిల్లులకు ధాన్యం కేటాయింపు జరుగగా ఈ సీజన్‌లో 40 కి లోపు మిల్లులకు ధాన్యం కేటాయింపులుంటాయని సివిల్ సప్లయ్ వర్గాలు తెలుపుతున్నాయి.

అయినా నేటికీ ఎన్ని మిల్లులకు ధాన్యం ఇస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. అయితే మిల్లుల ఎంపికతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, సేకరించిన ధాన్యాన్ని గోడౌన్‌లకు తరలించి నిల్వచేస్తామని అధికారులు తెలుపుతున్నారు. 

మిల్లుల ఎంపికతో సంబంధం లేదు

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సిద్ధం గా ఉన్నాం. మిల్లుల ఎంపికతో సంబం ధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన ధాన్యం గోడౌన్‌లకు తరలిస్తాం. రైతులు వరి కోతలు పూర్తి చేసుకుని నేరుగా ధాన్యం కేంద్రాలకు తెస్తున్నారు. ధాన్యం ఆరబోసి ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్న ధాన్యం మాత్ర మే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావా లి. ధాన్యం కొనుగోళ్లు త్వరలోనే ప్రారంభిస్తాం. 

 రాజేశ్వర్, డీఎస్‌వో, సూర్యాపేట