calender_icon.png 1 January, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం సేకరణ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలి

29-12-2024 04:28:25 PM

అదనపు కలెక్టర్ డేవిడ్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రైతుల వద్ద నుండి సేకరించిన ధాన్యం వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. ఆదివారం చింతల మానేపల్లి, రవీంద్ర నగర్ గ్రామాలలోని వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని వేరువేరు కొనుగోలు కేంద్రాలలో అమ్మాలని రైతులకు సూచించారు. నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం వస్తే ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇంతవరకు ఎంత ధాన్యం సేకరించాలని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ఆర్ ఐ విజయ్ కుమార్, బీసీఏఓ రబ్బాని, సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.