calender_icon.png 4 December, 2024 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

12-11-2024 01:33:01 PM

ప్రారంభోత్సవంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని (విజయక్రాంతి): వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ లు రైతులను  కోరారు. మంత్రి శ్రీధర్ బాబు  ఆదేశాల మేరకు మంగళవారం మంథని మున్సిపల్ పరిధిలోని గంగపురి, శ్రీ పాదకాలనీ, అంగులూరు (పోచమ్మ వాడ) కన్నల, ఖానాపూర్, వెంకటాపూర్, స్వర్ణపల్లిలోని వరి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు చైర్మన్ కొత్త శ్రీనివాస్ తో కలిసి, మున్సిపల్  చైర్ పర్సన్ రమాదేవి  ప్రారంభించారు. 

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్ బాబు రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. సన్న రకం వడ్లకు రూ.500 రూపాయల బోనసును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, దళారుల చేతుల్లో మోసపోవద్దన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలన్నారు. ఈ  కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కులా సురేందర్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ శ్రీపతి బాణయ్య, కౌన్సిలర్స్, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర శంకర్, వి కె రవి, కాంగ్రెస్ నాయకులు మూల పురుషోత్తం రెడ్డి, పెంటరి రాజు, ఆకుల శ్రీను, రమేష్, గణేష్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు సహకార సంఘం డైరెక్టర్లు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.