calender_icon.png 13 November, 2024 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

11-11-2024 05:29:32 PM

మణుగూరు: ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర్ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని మద్దతు ధర పొందాలని తెలిపారు.

సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ధాన్యంలో తరుగు పేరుతో కోతలు లేకుండా చివరి గింజవరకు ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు ధాన్యంలో తేమ శాతం ఉండేలా రైతులు చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఏడిఎ తాతారావు, తహశీల్దార్ ముజాహిద్, ఎంపిడిఓ జమలా రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి ఆర్ శంకర్, నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, బర్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు