05-04-2025 01:38:13 AM
జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు.
సూర్యాపేట,ఏప్రిల్4(విజయక్రాంతి): సి ఎమ్ ఆర్ బకాయి పూర్తి చేసిన మిల్లర్లకే వా 2024 -25 రభీ సీజన్ ధాన్యం కేటాయించటం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సివిల్ సప్లై అధికారులతో,మిల్లర్లతో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2022-23 రభీ సీజన్, 2024-25 ఖరీఫ్ సీజన్ సి ఎమ్ ఆర్ బకాయిలను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.బ్యాంకు గ్యారంటీ ఉన్న మిల్లర్లకి మాత్రమే 2024-25 ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయించటం జరుగుతుందని, వేలం వేసిన ధాన్యం బకాయిలు కూడా త్వరగా చెల్లించాలని తెలిపారు.
మిల్లులకి వచ్చిన ధాన్యం ఎలాంటి పెండింగ్ లు పెట్టకుండా వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశం లో జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేశ్వర్, డి ఎం ప్రసాద్, ఎ ఎస్ ఓ శ్రీనివాస రెడ్డి, డి టి లు, మిల్లర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.