03-04-2025 12:47:14 AM
వైరా, ఏప్రిల్ 2:-స్నాతకోత్సవం అనేది విద్యార్ధుల పూర్వ ప్రాధమిక విద్యకు ఘనమైన గుర్తింపు అని న్యూలిటిల్ ఫ్లవర్స్ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని. భూమేష్ రావు , డైరెక్టర్ కుర్రా. సుమన్ లు పేర్కొన్నారు..బుధవారం న్యూ లిటిల్ ఫ్లవర్ ప్రైడ్ క్యాంపస్ నందు గ్రాడ్యుయేషన్ డే వేడుక ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
కిండర్ గార్డెన్ సంవత్సరాలలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల తీపి జ్ఞాపకాలను గుర్తుచేసు కోవడా నికి దోహదపడతాయన్నారు.విద్యార్ధులలో ఏకత్వ స్పూర్తిని తెలియజేయటంతో పాటు గా ఈ దశలో పిల్లలు ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారని. వారు పేర్కొన్నారు ఇలాంటి వేడుకలు వారి భవిష్యతు పై ప్రభావం చూపి మంచి గ్రాడ్యుయేట్లుగా తిర్చిదిద్దబడతారని అనటం లో ఎలాంటి సందేహం లేదన్నారు. . ఇలాంటి సంస్కృతిని న్యూ లిటిల్ ఫ్లవర్ ముందుకు తిసుకేళ్తునందుకు గర్వకారణంగా ఉందని వారు తెలిపారు .
సీనియర్ కేజి విద్యార్ధులు సాధించిన మైలురాళ్ళు అని అదే సమయంలో ప్రాధమిక విద్య యొక్క కొత్త ప్రపంచం వైపు వారిని నడిపించుటకు చేసే గొప్ప ప్రయత్నం. అన్నారు.విద్యార్ధులకు సర్టిఫికెట్లతో బహుమతులు ఇవ్వడం అనేది వారి యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ షాజీ మాథ్యూ, ఎ.ఓ నరసింహారావు విద్యార్థులు, తలిదండ్రులు పాల్గొన్నారు.