03-04-2025 06:27:07 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని శ్రీ చైతన్య లక్ష్మీనగర్ బ్రాంచ్ స్కూల్‌లో గురువారం గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా జరిపారు. పాఠశాలలో యుకేజి పూర్తి చేసి ఒకటవ తరగతిలోకి, ఐదవ తరగతి పూర్తి చేసి ఆరవ తరగతిలో అడుగు పెట్టే విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ అయూబ్ మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ వేడుకలు చేస్తున్నామని అన్నారు. శ్రీ చైతన్య పాఠశాలల ఛైర్మన్, డైరెక్టర్లు మల్లెంపాటి శ్రీధర్, శ్రీవిద్య విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అరవింద్ రెడ్డి, ప్రిన్సిపాల్ అయూబ్, కో - ఆర్డినేటర్లు జయశ్రీ, రోజా రాణి, ఇంచార్జిలు అనగమాత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.