calender_icon.png 31 March, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గ్రాడ్యుయేట్ డే వేడుకలు

28-03-2025 10:08:02 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో భాగంగా ఐదో తరగతి చదువుతున్న ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఆరవ తరగతిలో అడుగుపెడుతున్న విద్యార్థులు ఈ వేడుకలో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ వేడుకలు  విద్యార్థుల జీవితంలో మరొక ముందడుగు అని అన్నారు. కొత్త తరగతిలో మరింత పట్టుదలతో చదివాలని కోరారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  ఇంచార్జ్ సునీత, ఉపాద్యాయులు శ్వేత, భవిత, సుజాత, అంజుమ, స్రవంతి, స్వప్న, లయ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.