calender_icon.png 6 April, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణ పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేట్ డే వేడుకలు

05-04-2025 10:38:13 PM

అలరించిన చిన్నారుల అద్భుత నృత్యాలు..

పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచ పట్టణ పరిధిలోని నెహ్రూనగర్ లో గల నారాయణ పాఠశాలలో శనివారం ఈ కిడ్స్, ఈ చాంప్స్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ పూరేటి నరసింహరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిదులుగా నారాయణ విద్యా సంస్థల ఖమ్మం జోన్ ఏ.జిఎం యోగ రాంకీ, పాల్వంచలోని ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ కిరణ్ కుమార్, ఈ-చాంప్స్ ఆర్ అండ్ డి హెడ్  స్వాతి లక్ష్మి, హెచ్.ఆర్ సతీష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు హుషారుగా తమ అద్భుత నృత్య ప్రదర్శనలతో ఆహుతులను విశేషంగా అలరించారు.

అనంతరం ఈ కిడ్స్ నుండి ఈ చాంప్స్ కు,5వ తరగతి నుండి 6వ తరగతికి వెళ్లుచున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పొందైటప్పుడు ధరించే ప్రత్యేక  దుస్తులు ధరింప చేసి, మెడల్స్ తో సన్మానించి, గ్రాడ్యుయేషన్ పట్టాలను ముఖ్య అతిధుల చేతుల మీదుగా చిన్నారులకు అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి నారాయణ పాఠశాలల ఖమ్మం ఏ.జిఎం యోగ రాంకీ  మాట్లడుతూ విద్యార్థులు విత్తనం లాంటివారని, తల్లితండ్రులు నారాయణ పాఠశాల అనే మంచి భూమిలో నాటారని, ఎంత పెద్ద చెట్టు అయిన వాటి వేర్లు ముఖ్యమని అలాగే చిన్నారుల పునాదులు నారాయణ పాఠశాల వాతావరణంలో ఉండడంవల్ల, వారి మెదడు నిండా అక్షర జ్ఞానంతో పాటు దయ, జాలి, మంచి-చెడు, ప్రేమ-జాలి గుణాలను నేర్చుకోవడంతో వారి పునాదులు బలంగా ఉంటాయన్నారు. 

ముఖ్య అతిధి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ప్రాథమిక విద్య ఎంతో కీలకమైనది అని, విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో విద్య ను అభ్యసించి ఉన్నత సానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ చాంప్స్ ఆర్ అండ్ డి హెడ్  స్వాతి లక్ష్మి మాట్లాడుతూ.. తమ పాఠశాలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఎల్.ఎస్.ఆర్.డబ్ల్యూ స్కిల్స్ మీద ప్రత్యేక శ్రద్ద వహించి ప్రతి విద్యార్థి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ లో పరిపూర్ణవంతులుగా సిద్ధం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఆర్ సతీష్, ఈ-చాంప్స్ కోఆర్డినేటర్ వినోద, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ నీలిమ, ఈ-టెక్నో ఏ.డి రామకృష్ణ, ఈ చాంప్స్ వైస్ ప్రిన్సిపాల్ రుచిత శ్రీ, ఈ కిడ్స్ వైస్ ప్రిన్సిపాల్ పద్మ, మల్లేష్, వినయ్, ఏ.వో వీర తదితరులు పాల్గొన్నారు.