25-04-2025 06:11:32 PM
నిర్మల్ (విజయక్రాంతి): స్థానిక విజయ హైస్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. ఈ వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని పిల్లల విద్యా ప్రస్థానంలో ముఖ్యమైన ఘట్టాన్ని జరుపుకున్నారు. పిల్లలు ఎరుపు నలుపు రంగుల దుస్తులు గ్రాడ్యుయేషన్ గ్రౌండ్లు ధరించి వేదికపై డిప్లోమాలు స్వీకరించారు. వారు చేసిన నృత్యాలు పాటలు ఇతర ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల విజయాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యాలయం జనరల్ సెక్రెటరీ శ్రీ అయ్యన్నగారి భూమయ్య మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ విద్యను పూర్తి చేసుకుని, తదుపరి విద్య ప్రమాణానికి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. వారు పొందిన జ్ఞానం, అనుభవం, స్నేహం జీవితాంతం గుర్తుండేలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాలయం వైస్ ప్రెసిడెంట్ అంబారాణి, కరెస్పాండెంట్ మంచిరాల నాగభూషణం, ట్రెజరర్ ఆడెపు సుధాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ విజయలక్ష్మి, ఆమెడ కిషన్, ప్రిన్సిపల్ సామ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.