calender_icon.png 27 April, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత్ నగర్ అంగన్వాడి కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే

26-04-2025 07:09:52 PM

సిద్దిపేట (విజయక్రాంతి): గర్భిణీ, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వప్న(ICDS Supervisor Swapna) సూచించారు. శనివారం సిద్దిపేట ఐసిడిఎస్ పరిధిలోని వడ్డెర కాలనీ, ప్రశాంత్ నగర్ లోని అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో సూపర్వైజర్ పాల్గొని మాట్లాడారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలని తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాలకే పంపించాలని, గర్భం దాల్చిన ప్రతి మహిళ సమీపంలోని అంగన్వాడి కేంద్రంలో నమోదు చేసుకోవాలని సూచించారు.

బాలింతలు అంగన్వాడి కేంద్రంలోనే మధ్యాహ్న భోజనం చేయాలని చెప్పారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు నిర్వహించే ప్రతి కార్యక్రమం వారి జీవితాంతం తీపి జ్ఞాపకం గా మిగిలిపోతుందని తెలిపారు. వేసవికాలంలో పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సి ఆర్ పి శ్వేత, అంగన్వాడీ టీచర్లు భాగ్యలక్ష్మి, వినోద, హమీద, పర్వీన్ సుల్తానా, ఆయాలు పాల్గొన్నారు.