28-02-2025 09:10:03 PM
కాటారం (విజయక్రాంతి): నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని కాటారం మండల కేంద్రంలోని న్యూ కేంబ్రిడ్జి హై స్కూల్లో గ్రాడ్యుయేట్ డే, అన్యూవల్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని తల్లిదండ్రులకు, విద్య సంస్థకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్య అనేది తరగని ఆస్తి అని, చదువు తోనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం గ్రాడ్యుయేట్లుగా ప్రమోట్ అయిన ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అన్నమనేని సాయి వాణి, ప్రిన్సిపాల్ అన్నమనేని పృధ్విధర్ రావు, ట్రెస్మా జిల్లా సెక్రెటరీ సంపత్ రావు, న్యూకేంబ్రిడ్జి వ్యవస్థాపకులు తాటి శ్రీనివాస్, ఆదర్శ నగర్ కాలనీ కన్వీనర్ ఆత్మకూరి కుమార్ యాదవ్, బిరెల్లి మహేష్ విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.