16-04-2025 01:24:45 AM
కరీంనగర్ క్రైమ్,ఏప్రిల్15(విజయక్రాంతి): విద్యాసంవత్సరం ముగింపు సందర్భంగా స్థానిక భగవతి పాఠశాలలో ప్రీప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని పాఠశాలల చైర్మెన్ బి. రమణరావు మరియు డైరెక్టర్ బి. విజయలక్ష్మి పాల్గొని జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా కేజీ2 తరగతి నుండి 1వ తరగతికి వెలుతున్న విద్యార్థులందరికి తమ ప్రీప్రైమరి విద్య పూరైన సందర్భంగా గ్రాడ్యుయేషన్ దుస్తులు ధరించి సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా రమణరావు మాట్లాడుతూ విద్యార్థి దశలలో ప్రీప్రైమరి తరగతి ఎంతో ముఖ్యం అని అన్నారు.