22-04-2025 05:09:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని నటరాజ్ నగర్ బచ్పన్ సంస్కార్ ప్లే స్కూల్‌లో మంగళవారం గ్రాడ్యుయేట్ డేను నిర్వహించారు. పాఠశాలలో చదివిన విద్యార్థులకు ప్రముఖ వైద్యులు పూదరి సాయిచంద్ సర్టిఫికెట్లను అందజేశారు. విద్యతో పాటు క్రమశిక్షణ వ్యాయామం తదితర అంశాలను పిల్లలకు నేర్పించడం అభినందనీయమని ఒత్తిడి లేని విద్యను అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అయ్యన్న గారి రచన నిర్వాకులు అయ్యగారు శ్రీధర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.