15-04-2025 10:44:00 PM
మంచిర్యాల (విజయక్రాంతి): నస్పూర్ లోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ లో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ దేవన్న మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్నతనం నుంచే విద్యతో పాటు ఇతర రంగాలపై దృష్టి సారించేలా ప్రోత్సహిస్తూ, వారి మెదడుకు పదును పెట్టే చెకుముకి టాలెంట్ టెస్ట్ లాంటి పోటీలు సైతం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. సమ్మర్ హాలిడేస్ లలో పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల పిల్లలు ఎండకు బయటికి వెళితే ఎండ దెబ్బ తాకి అనారోగ్యాల బారిన పడతారని, విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.