calender_icon.png 25 February, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రులు కాంగ్రెస్ వైపే..

25-02-2025 12:25:36 AM

రాష్ట్ర ఫిషరీస్ సొసైటీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ ఇంచార్జీ 

కాట శ్రీనివాస్‌గౌడ్, మెదక్ పార్లమెంట్ కంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు 

పటాన్చెరు, ఫిబ్రవరి 24 : నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఏడాదిలోనే 56వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపే పట్టబద్రులు ఉన్నారని  రాష్ట్ర ఫిషరీస్ సొసైటీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. సోమవారం పటాన్చెరు నియోజకవర్గంలోని అశోక్ నగర్ సితార గ్రాండ్లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి   కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధుతో కలిసి మెట్టు సాయికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. గత పది ఏళ్లలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన నిరుద్యోగులకు పెద్దపీటవేస్తూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే 56వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్గౌడ్, మెదక్ పార్లమెంట్ కంటెస్టేడ్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలోని పట్టబద్రులు చైతన్యవంతులని తమకు అన్ని విధాల న్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి సేవలను వారు అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రాడ్యుయేట్ ఓటర్లంతా ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తూంకుంట అంక్షారెడ్డి , ప్రధాన కార్యదర్శులు రఘురాం శివాంత్ రెడ్డి, షామిలి, కాంగ్రెస్ నాయకులు, పట్టభద్రులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.