24-02-2025 12:46:17 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్ ,ఫిబ్రవరి 23(విజయ క్రాంతి):మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎం.ఎల్.సి. ఎన్నికలలో భాగంగా ఈ నెల 27వ తేదీన జిల్లాలో జరుగనున్న పోలింగ్లో రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపారం, పరిశ్రమలు, ట్రేడ్ ఇతర సంస్థలలో పని చేస్తున్న అర్హత గల ఓటర్లు తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంeల నుండి సాయంత్రం 4 గంeల వరకు పోలింగ్ జరుగుతుందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్ రోజు సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని, (పైవేట్ సంస్థలలో పని చేసే ఉద్యోగులు, అధికారులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా విధులలో వెసలుబాటు కల్పించడం జరుగుతుందని / సెలవు దినం ఇవ్వడం జరుగుతుందని, ఆయా సంస్థల యాజమాన్యాలు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సహకరించాలని తెలిపారు.