18-02-2025 01:40:09 AM
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ వూట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి, ఫిబ్రవరి 1౭: జిల్లాలోని పట్టభ ద్రులంతా ఓటు హక్కును వినియోగించుకో వాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు కోరారు. పెద్దపల్లి పట్ట ణం కేంద్రంలోని స్వరూప గార్డెన్స్ లో పెద్దప ల్లి నియోజకవర్గానికి సంబంధించిన పట్టభ ద్రులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్యే విజయరమణ రావు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజర య్యారు. మంత్రితోపాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, ఎ మ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి బండారి శ్రీకాంత్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. ఈ నేల 27న జరగనున్న కరీంనగర్ - మెదక్ - ఆదిలాబాద్ - నిజామా బాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యాసంస్థల అదినేత వూట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిం చాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానికుడని అతనికి పట్టభద్రులంతా మద్దతు ఇచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లో గెలిపించాలని కోరారు.
ఇతరులకు ఓటు వేసి తమ ఓటును వృధా చేసుకోవద్దని, కాంగ్రెస్ పార్టీ ఎన్నో గొప్ప సంక్షేమ పథకా లను అందజేసి రాష్ర్ట ప్రజలందరికీ తోడుగా ఉంటుందని రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఐదు వందలకే గ్యాస్ సిలిండర్, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి పథకాలను అమలు పరుస్తూ పేదలకు మేలు చేకూరు స్తుందని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరి యల్ నంబర్ 2 లో గల అల్ఫోర్స్ వూట్కూ రి నరేందర్ రెడ్డి పట్టభద్రులందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అలాగే నరేందర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే తెలి పారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పట్ట భద్రులు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కె ట్ చైర్మన్లు, డైరక్టర్లు, సింగల్ విండో చైర్మన్లు, డైరక్టర్లు, తాజా మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీ సీలు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరు లు పాల్గొన్నారు.