22-02-2025 07:44:58 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాపాలన ప్రభుత్వం(Prajapalana Government) నిరుద్యోగ యువత యువతకు ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే 53,000 ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరిగిందని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి(Former Union Minister Venugopala Chary), డీసీసీ అధ్యక్షులు శ్రీ హరి రావు(DCC President Srihari Rao) అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలువాలని పిలుపునిచ్చారు. ఈనెల 27న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఈనెల 24న నిర్మల్ లో పట్టభద్రుల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమ్మేళనానికి పెద్ద ఎత్తున పట్టబదులు రావాలని సూచించారు. ఇది ఇలా ఉండగా మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి గంధతీశ్వర్ గ్రంథాలయ చైర్మన్ అర్జుమత్ అలీ పార్టీ నేతలు భీమ్ రెడ్డి నాందేడ్ చిన్ను గాజుల రవికుమార్ తదితరులు ఉన్నారు.