23-02-2025 12:01:09 AM
జగిత్యాల,(విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్‌రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. కోరుట్ల సాయిబాబా ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో శేఖర్‌రావుకు స్వల్ప గాయాలు కాగా ఆయను ఆసుపత్రికి తరలించారు. కారు ముందు బాగా ధ్వంసమయింది. నిజామాబాద్‌లో ప్రచారం ముగించుకొని శేఖర్‌రావు కరీంనగర్‌వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.