calender_icon.png 27 February, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయం ముగిసే.. గేటు పడే

27-02-2025 07:23:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నాలుగు గంటల తర్వాత వచ్చిన వారికి ఓటు వేసేందుకు నిరాకరించారు. పట్టణంలోని ఆర్ అండ్ బి పోలింగ్ కేంద్రం ఇంద్రనగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం తదితర కేంద్రాల వద్దకు నాలుగు గంటల తర్వాత కొందరు గ్రాడ్యుయేట్ అభ్యర్థులు(Graduate Candidates) వచ్చినప్పటికీ వారికి ఓటు వేసేందుకు అనుమతించకుండా పోలీసులు గేట్లను మూశారు. తాము సుదూర ప్రాంతాల నుంచి ఓట్లు వేసింది వచ్చామని ఓటర్లు చెప్పిన నిబంధన ప్రకారం మేము నడుచుకుంటామంటూ పోలీస్ సిబ్బంది చెప్పడంతో వారు నిరాశతో వెనుతిరిగారు. నాలుగు గంటల లోపు లైన్లో ఉన్నవారికి పోలింగ్ బూత్ లోకి అనుమతి ఇచ్చి గేట్లను మూశారు.