27-02-2025 09:50:29 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో గురువారం పట్టభద్రులు,ఉపాద్యాయుల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టభద్రులు 66.69 శాతం, ఉపాధ్యాయుల 91.06 పోలింగ్ శాతం నమోదైంది. నియోజకవర్గంలో 5289 మంది పట్టభద్రులు ఓటు వేయాల్సి ఉండగా 3527 మంది, 235 ఉపాధ్యాయులు మంది ఓటు వేయాల్సి ఉండగా 214 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్కడ సమస్యలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.