calender_icon.png 28 April, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ మెమోల్లో మార్కులతో పాటు గ్రేడ్లు

28-04-2025 02:29:46 AM

ఈ మేరకు జీవో జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): పదో తరగతి మార్కుల మెమోలను ఎలా ముద్రించాలన్న అంశంపై  ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. 2024 విద్యాసంవత్సరానికి పదో తరగతి మోమోలపై మా ర్కులతో పాటు గ్రేడ్లను సైతం ముద్రించాలని నిర్ణయిస్తూ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతిలో ఈ విద్యా సంవత్సరం నుంచి గ్రేడింగ్ విధానాన్ని తీసేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు కొత్తగా గ్రేడ్ల స్థానంలో మార్కుల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఇంటర్నల్స్‌ను రద్దుచేయాలని నిర్ణయం తీసుకున్నా.. ఆల స్యమవడంతో ఈ ఒక్క ఏడాదికి ఇంటర్నల్స్ ఉంటాయని ప్రకటించారు. అయితే మెమోలపై మార్కులను ఎలా ముద్రించాలన్న అం శంపై తేల్చేందుకు అధికారులు ఓ కమిటీని నియమించగా.. కమిటీ పలు సిఫార్సులు చేసింది.

ఈ సిఫార్సులు సర్కార్‌కు చేరడంతో దీనిపై నిర్ణయం తీసుకొని, తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.  రెండు, మూడు రోజుల్లో రిజల్ట్స్ విడుదల కానున్నాయి.

ఇకపై ఇలా..

పదో తరగతి మెమోలపై ఇంటర్నల్స్ మా ర్కులు, వార్షిక పరీక్షల మార్కులుంటాయి. మొత్తం మార్కులతో పాస్ సర్టిఫికెట్‌ను జారీచేస్తారు.. గ్రేడ్లు, మార్కులను వేర్వేరుగా ము ద్రిస్తారు. సబ్జెక్టుల వారీగా సాధించిన మా ర్కులుంటాయి. సబ్జెక్టుల వారిగా గ్రేడ్లు, మా ర్కులను రెండింటిని సర్టిఫికెట్‌లో ముద్రిస్తా రు. పదో తరగతిలో ఇంటర్నల్స్‌లో 20 మా ర్కులు కేటాయించారు.

ఈ సహపాఠ్య కార్యక్రమాలకు గ్రేడ్లు ఇస్తారు. వీటిని ఎస్సెస్సీ పాస్ సర్టిఫికెట్‌లో చూపుతారు. పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రస్తుతం ఒక సబ్జెక్టులో 80 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో 28 మార్కులొస్తే పాసైనట్టు లెక్క. ఇంటర్నల్స్‌లో ఎన్ని మార్కులొచ్చినా వార్షిక పరీక్షల్లో 28 మార్కులు సాధించాల్సిందే. హిందీలో మాత్రం 16 మార్కులొస్తే పాస్ అయినట్లు. మెమోలపై ప్రథమశ్రేణి, ద్వితీయశ్రేణి, తృతీయ శ్రేణి అంటూ ఉండదు.. ఎన్ని మార్కులొచ్చినా పాస్ అనే ఉంటుంది.