- టూరిజం ప్రాంతాల్లోని వాహనాలు, బోట్లకు జీపీఎస్ ట్రాకర్లు
- పీపీపీ మోడ్‌లో నిర్వహించనున్న పర్యాటక కార్పొరేషన్
హైదరాబాద్, నవంబర్ ౧౦ (విజయక్రాంతి): రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పనపై టూరిజం శాఖ స్పెషల్ ఫొకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టూరిజం ప్రాంతాలను జీపీఎస్ నిఘాలో ఉంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
పీపీపీ మోడ్‌లో జీపీఎస్ ట్రాకిం గ్ వ్యవస్థను నిర్వహించాలని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ భావిస్తోంది. తొలిదశలో భాగంగా పర్యాటక శాఖ కు చెందిన వాహనాలు, బోట్లకు జీపీఎస్ ట్రాకర్లను అమర్చాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించా రు.
మొదటిదశలో భాగంగా 30 వాహనా లు, 123 బోట్లకు జీపీఎస్ ట్రాకర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జీపీఎస్ సాఫ్ట్‌వేర్ నిర్వహణ, ట్రైనింగ్ కోసం టూరిజం కార్పొరేషన్ హెల్ప్ డెస్క్ అండ్ ట్రైనింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
నిర్వహణ బాధ్యత ప్రైవేట్ ఏజెన్సీకి..
వాహనాలు, పడవలకు జీపీఎస్‌ను అమర్చడం, మొబైల్, వెబ్ అప్లికేషన్‌ను ఏకీకృతం చేయడం, గూగుల్ మ్యాప్ సమాచారాన్ని సేకరించడం, టూరిజం శాఖ పరిధిలోని అప్లికేషన్లను జీపీఎస్ డేటాకు అనుసంధానించ డం, అన్నింటిని నిరంతరం పర్యవేక్షించడం లాంటి లక్ష్యాలతో జీపీఎస్ వ్యవస్థను తీసుకొస్తున్నారు.
దీని నిర్వహణ బాధ్యతను ప్రైవే ట్ ఏజెన్సీకి అప్పగించనున్నారు. తొలి విడతలో భాగంగా చేపట్టిన ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కాలపరిమితిని ఏడాదిగా నిర్ణయించారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై సైతం దృష్టి సారించారు.
పర్యాటకులకు వసతి సౌకర్యాన్ని కల్పించేందుకు మరిన్ని హరిత హోటల్స్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం టూరిజం కార్పొరేషన్ జాతీయ రహదారులు పక్కన ఖాళీగా ఉన్న ప్రదేశాలు, అద్దెకు ఇచ్చే పెద్ద భ వనాల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.