- వన మహోత్సం ఎలా నిర్వహిస్తారు?
- ఆరు నెలల్లో రూ.38వేల కోట్ల అప్పుచేశారు
- రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి ఫైర్
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం హరితహారం అంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవం తీసుకువచ్చిందని.. అయితే ఈ పథకానికి హస్తం పార్టీ ఒక్క నయాపైసా నిధులు విడుదల చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీశ్‌బాబు విమర్శించారు. ఈ పథకం నిర్వహణకు పంచాయతీల్లో నిధులు లేకపోతే సిబ్బంది ఏమి చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మట్లాడారు. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలుకు పంచాయతీల వద్ద నిధులు లేవని, పారిశుద్ధ్య సమస్యలతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీజనల్ వ్యాధుల బారి నపడి పీహెచ్‌సీలు, దవాఖానాల్లో సరైన వైద్యం అందక ప్రజలు అల్లాడుతున్నారన్నా రు.
కేసీఆర్ సర్కార్ లాగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్ట ప్రభుత్వం తక్షణమే జీపీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టులో రైతు రుణమాఫీ కోసం నిధులను ఆపుతున్నారేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో రూ.38వేల కోట్ల అప్పుచేసిన దివాలకోరు ముఖ్యమంత్రి రేవంత్ అని.. విమర్శించారు. కేకే రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లుగానే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రులు నియోజకవర్గాలకు వస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏ పథకం ప్రకటించినా ముందుగా కొడంగల్, మధిరకే ఆ పథకానికి సంబంధించి ముందుగా నిధులు కేటాయి స్తున్నారని.. ఇది మిగతా నియోజకవర్గాలపై వివక్ష కాదా అని పాల్వాయి విమర్శించారు.