calender_icon.png 4 April, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి భారీగా తరలి వెళ్లిన గౌడులు

31-03-2025 06:39:56 PM

జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్...

కామారెడ్డి (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఉన్న గౌడులను ఒక తాటిపైకి తెచ్చి వారందరి నోట పాపన్న మహారాజ్ చరిత్రను ప్రచారం చేయించే బృహత్తరమైన బాధ్యత మనందరిదని జై గౌడ ఉద్యమ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగుల మురళి గౌడ్ అన్నారు. పాపన్న మహారాజ్ చరిత్రను తెలియజేయడం కోసమే ఢిల్లీలో నిర్వహిస్తున్న పాపన్న మహారాజ్ ఆత్మ బలిదాన దినోత్సవం కార్యక్రమానికి తరలివెళ్తున్నట్లు తెలిపారు. సోమవారం కామారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్తున్నట్లు జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ అన్నారు. ఢిల్లీలో ఏప్రిల్ రెండవ తేదీన కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగే కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా నుండి భారీగా గౌడ సోదరులు తరలివెళ్తున్నట్లు వారు తెలిపారు.