calender_icon.png 18 January, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌడ హామీల ఊసెత్తని రేవంత్

16-07-2024 01:00:04 AM

మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఎన్నికలపుడు గౌడకులస్తు లకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై కాటమయ్య మోకుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడకపోవడం నిరాశపరి చిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆపార్టీ నేత పల్లె రవికుమార్‌తో కలిసి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఇచ్చిన మోకులు కేసీఆర్ పాలనలో తయారైనవేనని.. వాటి తయారీకి రూ.15 కోట్లు అప్పుడే మంజూరు చేశామని.. అయితే అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా వాటిని పంపిణీ చేయలోకపోయామన్నారు. వైన్స్, బార్ షాపుల నిర్వ హణకు గౌడ సోదరులకు కేసీఆర్ ప్రభుత్వం 15 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. అయితే వాటి నిర్వహణకు గౌడ సోదరులకు 25శాతం రిజర్వేషన్, ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు, జనగాం జిల్లాకు సర్వాయి పాపన్న పేరు తదితర హామీలపై మోకు పంపిణీలో రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లడలేదో చెప్పాలన్నారు. వెంటనే ఆయా హామీలను నెరవేర్చాలన్నారు.