మంచిర్యాల, (విజయక్రాంతి): ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాళ్లు అనాధ పిల్లలకు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే... మందమరికి చెందిన అర్చన, అభిలాషిని అనే ఇద్దరు ఆడపిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్న మహిళలు మానవ సేవా సమితి ద్వారా ఆ ఇద్దరు అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం అందజేసేందుకు ముందుకు వచ్చారు.
మానవ సేవ సమితి తరపున 25 వేల రూపాయలను తెలంగాణ గ్రామీణ బ్యాంక్, మందమర్రిలో మూడు సంవత్సరాల కాలపలమితితో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్లను శుక్రవారం వారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పిల్లలు ఇద్దరు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని, మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కొమరగిరి వాణిశ్రీ, లీలారాణి, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.