ప్రశ్నించడంతో నివ్వెరపోయిన అధికారులు
చెరువులు, బ్రిడ్జిలు, రహదారుల అభివృద్దికి ప్రత్యేక నిధులు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల,(విజయక్రాంతి): రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు నిండుకుండలా మారాయి, వాగులు ఉప్పొంగి, రహదారులపై నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి. ముందస్తు తీసుకున్న చర్యలేవని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంబంధిత అధికారులను ప్రశ్నించడంతో ఒక్కసారిగా నివ్వెరపోయారు. జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలంలోని లింగాపూర్ గ్రాయంలో నిండిన చెరువును పరిశీలించారు. శాలపెల్లి నుండి అడపపెల్లి, రంగధామునిపల్లె గ్రామాల్లో వరద నీరు చేరి జల దిగ్బంధంలో చిక్కుకొని రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, బ్రిడ్జిలు, రహదారుల అభివృద్దికి ప్రత్యేక నిధులు ప్రకటించారు. అధికారులతో మాట్లాడి గ్రామస్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సిఆర్ఆర్ గ్రాంట్ నుండి ఐదు కోట్ల రూపాయలతో పనులు శరవేగంగా చేపట్టి గ్రామాలకు సంబంధించి బ్రిడ్జి నిర్మాణానికి నివేదిక పంపించాలని ఆదేశించారు. అలాగే తూములకు మరమ్మతులు పూర్తి చేయాలని, మద్దులపల్లి గ్రామానికి చెందిన బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని, సంబంధించి రోడ్లు వరదలవల్ల కొంత దెబ్బతిన్నాయని వాటికితాత్కలికంగా మరమ్మత్తులు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భగవంతుని దయ వల్ల ఎక్కడ ఎలాంటి ప్రాణనష్టం ఆస్థి నష్టం జరగలేదని, చెరువులు, రోడ్లు, హై లెవెల్ బ్రిడ్జి గురించి జిల్లా కలెక్టర్ కు నివేదిక అందిస్తామని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.ఆయన వెంట వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.